Aditi Tatkare: షిండే క్యాబినెట్ లో తొలిసారి మహిళా మంత్రికి చోటు

Aditi Tatkare first woman minister in Eknath Shinde cabinet
  • ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్
  • షిండే మంత్రివర్గంలో అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి
  • అజిత్ పవార్ వెంట వచ్చిన వారిలో 9 మందికి మంత్రి పదవులు
  • మహిళా ఎమ్మెల్యే అదితి తత్కారేకు మంత్రి పదవి

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం, ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్... సీఎం ఏక్ నాథ్ షిండే క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా పదవిని పొందడం, ఆయనతో పాటు వచ్చిన వారిలో 9 మందికి మంత్రి పదవులు లభించడం తెలిసిందే. 

ఈ క్రమంలో షిండే క్యాబినెట్ లో తొలిసారి ఓ మహిళ మంత్రి పదవి చేపట్టారు. అదితి తత్కారే రాయగఢ్ జిల్లా శ్రీవర్ధన్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్సీపీ సంక్షోభంలో అదితి తత్కారే... అజిత్ పవార్ వెంట నడిచారు. ఇప్పటివరకు షిండే క్యాబినెట్లో మహిళలు ఎవరూ లేకపోగా, ఇప్పుడు అదితి రూపంలో తొలి మహిళా మంత్రి ఎంట్రీ ఇచ్చారు. 

శివసేనను నిట్టనిలువుగా చీల్చి, ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన షిండే... నాడు తన మంత్రివర్గంలో ఒక్క మహిళకూ చోటివ్వకపోవడం విమర్శలకు దారితీసింది. ఇప్పుడా లోటును సరిదిద్దుకున్నారు. అదితి తత్కారేకు మంత్రి పదవి ఇచ్చారు. అదితి గతంలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంలోనూ మంత్రిగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News