Rahul Gandhi: భట్టితో రాహుల్ ప్రత్యేక మంతనాలు.. గన్నవరం వరకు ఒకే కారులో ప్రయాణం!

Rahul gandhi special instructions to bhatti vikramarka
  • ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభ సక్సెస్‌తో కాంగ్రెస్‌లో జోష్ 
  • పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగించిన విక్రమార్కకు రాహుల్ సన్మానం
  • సభ ముగిసిన తర్వాత భట్టికి కీలక సూచనలు చేసిన అగ్రనేత

ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభ విజయవంతం కావడం కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సభకు లక్షాలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలిరావడంతో ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖుషీ అయినట్టు కనిపించారు. బీజేపీ, బీఆర్ఎస్ లపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆయన.. తాము అధికారంలోకి వస్తే నెలకు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ముగించిన సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కను రాహుల్  భజం తట్టి అభినందించారు.

లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని ఘనంగా సత్కరించారు. భట్టి తన యాత్రలో పేదలకు ఇచ్చిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇది వరకు తెలిపారు. ఈ క్రమంలో భట్టికి రాహుల్ గాంధీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సభ ముగిసిన తరువాత గన్నవరంవరకు రాహుల్ తో పాటుగా భట్టి ఒకే కారులో వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ గురించి ఆయనకు రాహుల్ కీలక సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News