Sharad Pawar: మా కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు: శరద్ పవార్

We dont have any problems in family says Sharad Pawar
  • 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్
  • సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమ కుటుంబంలో ఉంటుందన్న శరద్ పవార్
  • తిరుగుబాటు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని వ్యాఖ్య
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తంగా మారాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. పార్టీని నిట్టనిలునా చీల్చేశారు. 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో చేరారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ మాట్లాడుతూ... తమ కుటుంబంలో అంతర్గతంగా ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. కుటుంబంలో తాము రాజకీయాలు మాట్లాడుకోమని అన్నారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమ కుటుంబంలో అందరికీ ఉంటుందని చెప్పారు. నిన్నటి నుంచి తాను ఎవరితోనూ మాట్లాడలేదని తెలిపారు. తిరుగుబాటు చేసిన నేతలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Sharad Pawar
NCP
Ajit Pawar

More Telugu News