India: ఫ్రాన్స్ తోనూ అమెరికా తరహా ఒప్పందం... మోదీ పర్యటనకు ముందు కీలక పరిణామం!

India reportedly ties up with French aircraft engine maker Safran
  • జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం
  • ప్రత్యేక ఆహ్వానితుడిగా పారిస్ వెళుతున్న ప్రధాని మోదీ
  • ఆధునిక తరం యుద్ధ విమాన ఇంజిన్ టెక్నాలజీ అందించేందుకు ఫ్రాన్స్ అంగీకారం
  • భారత్ కు చెందిన ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఫ్రాన్స్ సంస్థ సఫ్రాన్ భాగస్వామ్యం!
ఈ నెల 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం జరగనుండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలకు హాజరుకానున్నారు. అయితే మోదీ పర్యటనకు ముందు ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఇటీవలే మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎంతో కీలకమైన జెట్ ఇంజిన్ ఒప్పందం కుదిరింది. 

ఆధునిక యుద్ధ విమానాలకు గుండెకాయ వంటి జీఈ-414 ఇంజిన్లను ఇకపై భారత్ లోనే తయారుచేసేందుకు అవసరమైన టెక్నాలజీని అమెరికా 100 శాతం బదిలీ చేయనుంది. ఇప్పుడు భారత్-ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం కూడా అలాంటిదేనని భావిస్తున్నారు. 

ఫ్రాన్స్ కు చెందిన అగ్రగామి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ సంస్థ సఫ్రాన్... భారత్ చేపడుతున్న అడ్వాన్స్ డ్ మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టులో పాలుపంచుకోనుంది. ఈ మేరకు సంయుక్త భాగస్వామ్యానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆమోదం తెలిపారు. 

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు ముందే ఈ ఒప్పందం తెరపైకి రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే 100 కేజీల న్యూటన్ ఇంజిన్ పూర్తిగా భారత్ లోనే తయారుకానుంది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
India
France
AMCA
Safran
Narendra Modi
Macron

More Telugu News