Kichcha Sudeep: ‘నేను మనిషిని కాదు.. భూతాన్ని’.. కిచ్చా సుదీప్ కొత్త సినిమా టీజర్ అదుర్స్!

kichcha sudeep k46 demon war begins telugu promo
  • ‘కే46 డెమోన్ వార్ బిగిన్స్’ అంటూ సుదీప్ కొత్త సినిమా ప్రోమో రిలీజ్
  • తనకి తానే ఒంట్లో నుంచి బుల్లెట్స్ తీసుకుంటూ కనిపించిన సుదీప్
  • దర్శకుడు విజయ్ కార్తికేయ.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్
ఇటీవల ‘కబ్జా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఉపేంద్ర, శివరాజ్‌కుమార్ నటించిన ఈ మల్టీస్టారర్‌‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు సోలో హీరోగా నటించిన ‘విక్రాంత్‌ రోణ’ మంచి విజయం సాధించింది. ఈ సారి మరో భారీ యాక్షన్ మూవీతో సందడి చేసేందుకు సుదీప్ సిద్ధమవుతున్నాడు. 

సుదీప్ కొత్త సినిమాపై ఈ రోజు అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘కే46 డెమోన్ వార్ బిగిన్స్’ అంటూ ఓ పవర్ ఫుల్ టీజర్‌‌ను రిలీజ్ చేశారు. ఓ బస్సులో బుల్లెట్ గాయాలతో ఉన్న సుదీప్.. తనకి తానే ఒంట్లో నుంచి బుల్లెట్స్ తీసుకుంటూ కనిపించాడు.

హీరోను చంపడానికి ఓ గ్యాంగ్ ట్రై చేయడం.. ఒకవేళ ఎవరి వల్ల కాకపోతే తమకు సిగ్నల్ ఇస్తే చూసుకుంటామని గ్యాంగ్ చెప్పడం.. దానికి సుదీప్ నే సిగ్నల్ ఇచ్చి వారందరినీ తన దగ్గరికి రప్పించుకోవడం.. ఆసక్తికరంగా సాగింది. 

ఇక టీజర్ చివర్లో ‘‘యుద్ధాన్ని ఆరంభించేవాడు నాకు నచ్చడు. యుద్ధానికి భయపడి పారిపోయే వాడూ నచ్చడు. రంగంలోకి దిగి, శత్రువులను వేటాడి, వెంటాడి, పారిపోయేలా చేసే వాడిని నేను.. దిగితే దయ, క్షమ వంటివేవీ చూడను. నేను మనిషిని కాదు.. భూతాన్ని” అంటూ సుదీప్ చెప్పే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.

దర్శకుడు విజయ్ కార్తికేయ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. వి క్రియేషన్స్ తో కలిపి సుదీప్ నిర్మిస్తున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.


Kichcha Sudeep
Vijay Kartikeyaa
Demon War Begins
K46

More Telugu News