Mallu Bhatti Vikramarka: బద్ధ శత్రువులుగా ఉన్నోళ్లే కాంగ్రెస్‌లో చేరారు.. షర్మిల వస్తే తప్పేంటి?: భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు

  • షర్మిలది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమేనన్న భట్టి
  • కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్లు పార్టీకి దూరమయ్యారని వెల్లడి
  • షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దని అంటున్న వాళ్లది వ్యక్తిగత అభిప్రాయమేనని వ్యాఖ్య
bhatti vikramarka comments on sharmila joining congress party

కాంగ్రెస్‌ పార్టీలో షర్మిల చేరుతారన్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్లపైనా పరోక్ష విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి శత్రువులుగా ఉండి, తిట్టిన వాళ్లే ఇప్పుడు పార్టీలోకి వచ్చి పనిచేస్తున్నారని.. అలాంటిది షర్మిలను తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

‘‘పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు, పార్టీని తిట్టిన వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి పనిచేస్తున్నారు. మరి షర్మిలను పార్టీలోకి తీసుకుంటే తప్పేంటి? షర్మిలది మొదటి నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె పార్టీకి దూరమయ్యారు” అని చెప్పారు. షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దని అంటున్న వాళ్లది వ్యక్తిగత అభిప్రాయమేనని అన్నారు.

  • Loading...

More Telugu News