France Unrest: పారిస్ మేయర్‌ కుటుంబంపై హత్యాయత్నం.. కారుతో ఇంట్లోకి దూసుకెళ్లి.. ఆపై నిప్పు పెట్టిన ఆందోళనకారులు

French protesters ram car into mayors house
  • మేయర్ కుటుంబం నిద్రిస్తున్న సమయంలో దాడి
  • అనంతరం ఇంటికి నిప్పు
  • గాయపడిన మేయర్ భార్యాపిల్లలు
  • పిరికిపంద చర్యన్న పారిస్ మేయర్ విన్సెంట్

టీనేజర్ మృతితో ఫ్రాన్స్‌లో మొదలైన అల్లర్లకు అడ్డుకట్ట పడడం లేదు. వందలాదిమంది పోలీసులను మోహరించినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా, పారిస్ మేయర్ విన్సెంట్ జీన్‌బర్న్ మాట్లాడుతూ.. నిరసనకారులు తన ఇంటిపైకి కారుతో దూసుకొచ్చి దాడిచేశారని ఆరోపించారు. ఈ క్రమంలో తన భార్యాపిల్లలు గాయపడ్డారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో కారుతో ఇంటిపైకి దూసుకొచ్చిన నిరసనకారులు ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారని చెప్పారు. ఈ ఘటనలో తన భార్య, పిల్లల్లో ఒకరు గాయపడ్డారని పేర్కొన్నారు. ఇది తన కుటుంబంపై జరిగిన హత్యాయత్నమేనని, ఇది పిరికిపంద చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపనందుకు 17 ఏళ్ల నేహేల్ ఎం కుర్రాడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. వరుసగా ఐదో రోజు కూడా నిరసనలు వెల్లువెత్తాయి. కార్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు కార్యాలయాలు, దుకాణాలు, పోలీస్ స్టేషన్లపై దాడికి దిగారు. భద్రతా బలగాలతో తలపడుతున్నారు. అల్లర్లను అదుపు చేసేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ 45 వేల మంది పోలీసులను మోహరించారు. అల్లర్ల నేపథ్యంలో మేక్రాన్ నేటి నుంచి జరగాల్సిన జర్మనీ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

  • Loading...

More Telugu News