Pawan Kalyan: పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమా రీ-రిలీజ్.. థియేటర్లో సీఎం.. సీఎం అంటూ నినాదాలు

  • తొలిప్రేమ రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద సందడి
  • భారీ కటౌట్లు, డ్యాన్సులతో అదరగొట్టిన అభిమానులు
  • పవన్ కల్యాణ్ సీఎం... అంటూ నినదించిన వీడియో నెట్టింట వైరల్
Pawan Kalyan CM slogans in theatre

పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమా శుక్రవారం రీ-రిలీజ్ అయింది. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద సందడి కనిపించింది. తొలిప్రేమ రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, డ్యాన్సులతో అదరగొట్టారు. థియేటర్ల లోపల కూడా పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్ అంటూ పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేశారు. ఓ థియేటర్ లో సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి సన్నివేశాలే పలు థియేటర్లలో కనిపించాయి.

More Telugu News