Prime Minister: ఢిల్లీ మెట్రోలో తాను ఎందుకు ప్రయాణించిందీ వివరించిన ప్రధాని

PM Modi explains why he took metro to Delhi University centenary function
  • యువతతో కలసి ప్రయాణించడం ఆనందాన్ని ఇచ్చిందని వెల్లడి
  • ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు
  • ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు. ఇందుకోసం ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లేందుకు మెట్రో సేవలు వినియోగించుకున్నారు. తన మెట్రో జర్నీ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. తాను మెట్రోలో ఎందుకు ప్రయాణించిందీ కూడా వివరించారు. ఢిల్లీ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘సహచరులతో కలసి క్యాంపస్ కు చేరుకోవడం మరింత ఆనందంగా ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అంశంపై ఇజ్రాయెల్ నుంచి చంద్రుడి వరకు మాట్లాడుకుంటున్నారు. ఏ సినిమా చూశావు, ఫలానా సిరీస్ ను ఓటీటీలో చూడొచ్చా, ఇన్ స్టా గ్రామ్ రీల్ ట్రెండ్ చూశావా? అని మాట్లాడుకుంటున్నారు. 

యువకులైన స్నేహితులతో నేను కూడా డిల్లీ మెట్రోలో ముచ్చటించా. వారితో కలసి ప్రయాణించడం ఆనందంగా ఉంది" అన్నారు. ప్రధాని మెట్రో జర్నీ వీడియోని బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిల్ పై షేర్ చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శతాబ్దం పాటు ప్రతిభను, మేధోపరమైన వృద్ధిని ప్రోత్సహించింది. ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీకి శుభాకాంక్షలు’’ అని ప్రధాని పేర్కొన్నారు.
Prime Minister
Narendra Modi
delhi metro
metro journy
Delhi University
centenary function

More Telugu News