Baby Movie: 'బేబీ' సినిమాపై భారీగా పెరుగుతున్న అంచనాలు.. సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండింగ్

Anand Devarakonda Baby movie trending in social media
  • ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో 'బేబి'
  • అంచనాలను పెంచేసిన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు
  • జులై 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న రొమాంటిక్, డ్రామ్ ఎంటర్టైనర్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన 'బేబీ' జులై 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలు, టీజర్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేశాయి. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ మారుతి, ఎస్కేఎన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం వస్తోంది. 

  • Loading...

More Telugu News