Kera: కేరళ డీజీపీగా వైఎస్ఆర్‌ జిల్లా వాసి

YSR district native appointed as kerala dgp
  • వైయస్‌ఆర్ జిల్లాకు చెందిన దర్వేష్ సాహెబ్ డీజీపీగా నియామకం
  • దర్వేష్ సాహెబ్ స్వస్థలం పోరుమామిళ్ల మండల కేంద్రం
  • పాఠశాల విద్య జిల్లాలోనే పూర్తి
  • తిరుపతిలో డిగ్రీ, పీజీ చేసిన డీజీపీ
  • తమ పట్టణవాసి కేరళలో ఉన్నతస్థితికి చేరుకోవడంపై స్థానికుల హర్షం

వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన దర్వేష్‌ సాహెబ్ రెండు రోజుల క్రితం కేరళ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. దీంతో, పట్టణ ప్రజలు, ఆయన స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని బెస్తవీధికి చెందిన ఆయన ప్రాథమిక విద్యను పోరుమామిళ్లలోనే పూర్తి చేశారు. ఆ తరువాత అయిదవ తరగతి వరకూ ప్రైవేటు పాఠశాలలో చదివారు. అనంతరం హైస్కూల్ విద్యను ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ జూనియర్ కళాశాలలో చదివారు. డిగ్రీ, పీజీ తిరుపతిలో పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News