Narendra Modi: మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు

Modi Telangana tour schedule fixed
  • వచ్చే నెల 8న తెలంగాణకు రానున్న మోదీ
  • కాజీపేటలో వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
  • వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్న పీఎం
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారయింది. వచ్చే నెల 8న ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మోదీ వరంగల్ కు రానున్నారు. రైల్వేశాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్నారు. 200 ఎకరాల్లో రూ. 10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది.
Narendra Modi
BJP
Telangana

More Telugu News