KTR: తొమ్మిదేళ్లలో చూసింది ట్రైలర్‌ మాత్రమే: కేటీఆర్

  • వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటామన్న కేటీఆర్
  • 2014లో తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నించారని ఆరోపణ
  • తెలంగాణ ఓ విఫల ప్రయోగంగా మారుతుందని భావించారని వ్యాఖ్య
brs will win 100 seats in upcoming assembly elections says ktr

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటామని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ తొమ్మిదేళ్లలో చూసింది ట్రైలర్‌ మాత్రమేనని, కేసీఆర్‌ ఆలోచనలో ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో క్రెడాయ్‌ కార్యాలయాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
వరుసగా మూడోసారి కూడా బీఆర్ఎస్‌ అధికారం చేపడుతుందని‌ అన్నారు. తెలంగాణది సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధి అని చెప్పారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరా సులభమైన విషయం అయితే.. గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో ఎంతో మంది కూల్చేయాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘‘2014లో మాకు వచ్చింది 63 సీట్లే. ఒక్క 10 మందిని అటు ఇటు చేస్తే ప్రభుత్వం ఆగమవుతుంది. తెలంగాణ ఓ విఫల ప్రయోగంగా అయిపోతుంది. వెంటనే ఇంకేదైనా చేయొచ్చనే ప్రయత్నాలు కూడా జరిగాయి” అని ఆరోపించారు.

More Telugu News