Revanth Reddy: ‘తన్నులాట’ గురించి ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు: రేవంత్‌రెడ్డి

revanth reddy respond on jithender reddys tweet
  • జితేందర్‌‌రెడ్డి ట్వీట్‌పై వ్యంగ్యంగా స్పందించిన రేవంత్
  • బీజేపీ అంతర్గత తన్నులాటను అద్భుతమైన పోలికతో వివరించారని ఎద్దేవా
  • ఆ పార్టీలో చేరిన వారి పరిస్థితి ఇదేనని వ్యాఖ్య
తెలంగాణ బీజేపీపై ఆ పార్టీ నేత జితేందర్‌‌రెడ్డి చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దున్నపోతును ఓ వ్యక్తి తన్నిన వీడియో పెట్టిన ఆయన.. ఇలానే తెలంగాణ బీజేపీ నేతలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని క్యాప్షన్ ఇచ్చారు. అది కాస్తా వివాదాస్పదం కావడంతో వివరణ ఇస్తూ ఆయన మరో ట్వీట్ కూడా చేశారు. 

దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. బీజేపీ అంతర్గత తన్నులాటను అద్భుతమైన పోలికతో వివరించారంటూ ఎద్దేవా చేశారు. ‘‘జితేందర్ రెడ్డి గారు.. బీజేపీ అంతర్గత ‘తన్నులాట’ను అద్భుతమైన పోలికతో ప్రజలకు వివరించారు. ఆ పార్టీలో చేరిన వారి పరిస్థితి గురించి ఇంత కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు!” అంటూ సెటైర్లు వేశారు.
Revanth Reddy
Jithender Reddy
Telangana BJP
BJP
Congress

More Telugu News