Rahul Gandhi: మణిపూర్ లో రాహుల్ కాన్వాయ్ ను ఆపేసిన పోలీసులు

Police stopped Rahul Gandhi convoy in Manipur
  • జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్
  • రెండు రోజుల మణిపూర్ పర్యటనకు వెళ్లిన రాహుల్
  • రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్ లో వెళ్లాలని కోరిన పోలీసులు
రెండు జాతుల మధ్య దాడులతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రం ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన మణిపూర్ చేరుకున్నారు. ఇంఫాల్ నుంచి ఘర్షణలకు కేంద్ర బిందువైన చురాచాంద్ పూర్ కు ఆయన బయల్దేరారు. అయితే, ఆయన కాన్వాయ్ ను పోలీసులు మార్గమధ్యంలోనే ఇంఫాల్ కు 20 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపూర్ వద్ద ఆపేశారు. 

పరిస్థితులు బాగోలేవని... రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్ లో అక్కడకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తూ... హింసాత్మక ఘటనలు పునరావృతమవుతాయని తాము ఆందోళన చెందుతున్నామని చెప్పారు. కాన్వాయ్ ను బిష్ణుపూర్ లోనే వదిలేయాలని కోరామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఇంఫాల్ కు తిరుగుపయనమయ్యారు.
Rahul Gandhi
Congress
Manipur

More Telugu News