Saichand: కేసీఆర్ ఎదుట భోరున విలపించిన సాయిచంద్ భార్య

KCR pays tributes to Saichand
  • గుండెపోటుతో మృతి చెందిన సాయిచంద్
  • సాయిచంద్ నివాసానికి వెళ్లి పుష్పాంజలి ఘటించిన కేసీఆర్
  • సాయిచంద్ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమైన సీఎం
తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి... సాయి భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎదుట సాయిచంద్ భార్య భోరున విలపించారు. ఆమెను కేసీఆర్ ఓదార్చారు. మరోవైపు సాయిచంద్ మృతదేహాన్ని చూసి కేసీఆర్ కన్నీటిపర్యంతం అయ్యారు.
Saichand
KCR
BRS

More Telugu News