dangerous stunts: బైక్ పై జంట సాహస విన్యాసాలు.. బెడిసి కొట్టడంతో గాయాలు

Couple falls off bike while performing dangerous stunts Delhi Police tweets video
  • ముందు చక్రం గాల్లోకి లేపి డ్రైవింగ్
  • నియంత్రణ కోల్పోవడంతో కింద పడిన జంట
  • నిర్లక్ష్య డ్రైవింగ్ తో ప్రమాదం అంటూ ఢిల్లీ పోలీసుల ట్వీట్
సాహస విన్యాసాలు అందరికీ సాధ్యం కావు. ఎంత అనుభవం ఉన్న వారైనా బెడిసి కొడితే ఎముకలు పీసులుగా మారతాయి. అయినా కానీ కొందరు యువత, అది కూడా బహిరంగ ప్రదేశాలలో, అందరూ వినియోగించుకునే రోడ్డుపై ఇలాంటి విన్యాసాలు చేస్తారు. దీనివల్ల దారినపోయే ఇతరుల ప్రాణానికి రిస్క్ చేస్తున్నారనే స్పృహ కూడా ఉండదు.

తాజాగా ఓ జంట ఇలానే బైక్ పై స్టంట్స్ చేసింది. చివరికి అది కాస్తా ప్రమాదానికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో వైరల్ గా మారిపోయింది. దీనిపై ఢిల్లీ పోలీసులు సైతం స్పందించారు. బైక్ పై జంట రయ్ మంటూ దూసుకుపోతోంది. బైక్ నడిపే వ్యక్తి వెనుక గర్ల్ ఫ్రెండ్ ను కూర్చోబెట్టుకున్నాడు. హ్యాండిల్ తో ముందు చక్రాన్ని గాల్లోకి లేపుతూ ముందుకు పోనిస్తున్నాడు. ఉన్నట్టుండి దానిపై నియంత్రణ కోల్పోవడంతో వెనుక కూర్చున్న మహిళ అలానే బలంగా రోడ్డుపై పడిపోయింది. దీని ధాటికి పిరుద ఎముకలు పచ్చడై ఉంటాయి. 

ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు పోస్ట్ చేస్తూ ‘నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ వల్ల ప్రమాదం కొని తెచ్చుకోవడం’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘వేగం థ్రిల్ ను ఇవ్వొచ్చు. కానీ కిల్ చేస్తుంది’’ అని ఓ నెటిజన్ తన స్పందన వ్యక్తం చేశాడు.
dangerous stunts
Couple
falls off
Delhi Police

More Telugu News