Alligator: పక్షిని వేటాడబోయిన అలిగేటర్.. దాన్ని మింగేసిన క్రోకోడైల్.. వీడియో ఇదిగో

Alligator trying to hunt bird gets eaten by crocodile Watch vedio
  • ఆకలి తీర్చుకునే ప్రయత్నంలో మరో జంతువుకు బలి అయిన అలిగేటర్
  • కొంగను పట్టుకునేందుకు ప్రయత్నించిన అలిగేటర్
  • పొదల చాటు నుంచి దూసుకొచ్చి దాన్ని తినేసిన మొసలి
జంతు ప్రపంచం ఎంతో భిన్నం. ఓ జంతువు మరో జంతువుకు ఆహారంగా ఏదో రోజు మారిపోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. తన ఆకలి తీర్చుకోవడం కోసం పోరాటం చేయడమే కాదు.. అదే సమయంలో తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రతి జంతువు ప్రతిక్షణం పోరాడాల్సి వస్తుంది. అందుకు నిదర్శనమే ఈ వీడియో. 

ఓ నీటి కొలను ఒడ్డున కొంగ వాలుతుంది. దాన్ని ఓ అలిగేటర్ (మొసలిలోనే ఒక రకం) చూస్తుంది. చిన్నగా వెళ్లి నోట కరుచుకుందామనుకొని మెల్లిగా అడుగులు వేస్తూ కొంగవైపు వెళుతుంటుంది. ఇంతలో పొదల్లోంచి బయటకు వచ్చిన ఓ పెద్ద మొసలి (క్రోకోడైల్) ఈ అలిగేటర్ ను చూస్తుంది. వెనుక నుంచి వేగంగా వచ్చేసి అలిగేటర్ ను నోట కరుచుకుంటుంది. అక్కడి నుంచి నీటిలోకి తీసుకెళ్లి దాన్ని మింగేస్తుంది. ఈ మొత్తం గేమ్ లో కొంగ సురక్షితంగా బయటపడింది. (వీడియో కోసం)

ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో తెగ వైరల్ అవుతోంది. దీనికి యూజర్లు నవ్వులు తెప్పించే కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఎన్నో ఏళ్ల నుంచి కొంగలు, మొసళ్లు కలసి పనిచేస్తున్నాయి. కొంగలకు మొసళ్లు రక్షణ కల్పిస్తాయి. దాంతో మొసళ్లకు కొంగలు ఆహారం లభించేలా చేస్తుంటాయి’’ అని ఓ యూజర్ జోక్ వేశాడు.
Alligator
hunt bird
crocodile attacked
eaten
viral vedio

More Telugu News