ritualistic sacrifice: బహిరంగ ప్రదేశాల్లో బక్రీద్ ప్రార్థనలు వద్దు: ఓ ఇమామ్ పిలుపు

No ritualistic sacrifice at public places Lucknow Imams appeal on Eid
  • ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని కోరిన లక్నో ఇమామ్
  • మసీదు, ఈద్గాల్లోనే నమాజు చేసుకోవాలని పిలుపు
  • బహిరంగ ప్రదేశాల్లో బలి ఆచారాలు నిర్వహించొద్దని వినతి

బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు నేడు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో లక్నో ఈద్గా ఇమామ్ స్కాలర్, మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి ముస్లిం ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈద్గాలు, మసీదుల్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని కోరారు. అంతేకానీ, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలకు దూరంగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలతో ప్రజలకు అసౌకర్యం కలగకూడదని ఈ విజ్ఞప్తి చేశారు. 

‘‘ఈద్ ఆల్ అదా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. పండుగలకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో ఇస్లామిక్ సెంటర్ ఫర్ అబ్జర్వింగ్ జారీ చేసిన సూచనలను అనుసరించాలని ప్రజలకు గుర్తు చేస్తున్నాను. ఈద్గా, మసీదుల్లోనే నమాజ్ చేయాలి. అంతేకానీ, రోడ్లు, వీధుల్లో కాదు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి బలి ఆచారాలు నిర్వహించొద్దు. కేవలం ప్రైవేటు ప్రదేశాల్లో, ఎంపిక చేసిన మదర్సాలలోనే వీటిని చేసుకోవాలి. అలాగే, వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయవద్దు’’ అంటూ మౌలానా ఖలీద్ రషీద్ ప్రత్యేకంగా కోరారు.

  • Loading...

More Telugu News