Ishita Shukla: భారత సైన్యంలో అగ్నివీర్ గా చేరిన బీజేపీ ఎంపీ కుమార్తె

BJP MP Ravi Kishan joined Indian army through Agniveer scheme
  • అగ్నివీర్ స్కీం ద్వారా సైన్యంలో ప్రవేశించిన ఇషితా శుక్లా
  • ఇషితా శుక్లా బీజేపీ ఎంపీ, భోజ్ పురి హీరో రవికిషన్ కుమార్తె
  • తన కుమార్తె ఢిల్లీ డైరెక్టరేట్ 7 గాళ్ బెటాలియన్ సభ్యురాలని రవికిషన్ వెల్లడి
బీజేపీ ఎంపీ, భోజ్ పురీ హీరో రవికిషన్ కుమార్తె ఇషితా శుక్లా భారత సైన్యంలో చేరారు. ఆమె అగ్నివీర్ స్కీం ద్వారా సైన్యంలో చేరినట్టు ఎంపీ రవికిషన్ వెల్లడించారు. తన కుమార్తె దేశ సేవ కోసం అగ్నివీర్ గా మారడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్తె ఢిల్లీ డైరెక్టరేట్ కు చెందిన 7 గాళ్ బెటాలియన్ లో సభ్యురాలని తెలిపారు. ఇషితా శుక్లా వయసు 21 సంవత్సరాలు. తన కుమార్తె సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటోలను రవికిషన్ ట్విట్టర్ లో పంచుకున్నారు.  

భారత త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం అగ్నివీర్ స్కీంను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తొలినాళ్లలో ఈ స్కీంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. ఆ ఆందోళనలు క్రమంగా చల్లారాయి.
Ishita Shukla
Ravi Kishan
Agniveer
Indian Army
BJP

More Telugu News