Neena Gupta: ఆ సీన్ షూటింగ్ తర్వాత నోటిని డెట్టాల్ తో కడుక్కున్నా: నీనా గుప్తా

Neena Gupta recalls her kiss scene
  • చాలా ఏళ్ల కిందట 'దిల్లగి' సీరియల్ లో నటించిన నీనా గుప్తా
  • ఆ సీరియల్ లో అధర చుంబన దృశ్యంలో నటించానన్న నీనా
  • ఆ రాత్రి తనకు నిద్రపట్టలేదని వెల్లడి
తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ, అంగద్ బేడీ, అనుష్క కౌషిక్ తదితరులు నటించిన సిరీస్ 'లస్ట్ స్టోరీస్ 2' రేపు విడుదల కాబోతోంది. ఈ సిరీస్ లో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీనా గుప్తా మీడియాతో మాట్లాడుతూ ముద్దు సన్నివేశానికి సంబంధించి తన గత అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. చాలా ఏళ్ల కిందట 'దిల్లగి' అనే టీవీ సీరియల్ లో తాను అధర చుంబన సన్నివేశంలో పాల్గొన్నానని... ఆ రాత్రి తాను నిద్రపోలేదని చెప్పారు. మన దేశ టీవీ సీరియల్స్ చరిత్రలో అదే తొలి అధర చుంబనం సీన్ అని తెలిపారు. 

ఆ సన్నివేశం సమయంలో తాను ఎంతో టెన్షన్ పడ్డానని నీనా చెప్పారు. అవతలి వ్యక్తి తన స్నేహితుడు కాదని, తన తోటి నటుడు మాత్రమేనని, అతను అందంగా ఉన్నప్పటికీ ముద్దు పెట్టడం ఇబ్బందికరమని అన్నారు. మానసికంగా, శారీరకంగా తాను సిద్ధంగా లేనప్పటికీ... ఆ సన్నివేశంలో నటించేందుకు తనను తాను కన్విన్స్ చేసుకున్నానని చెప్పారు. అంతేకాదు, ముద్దు సన్నివేశం షూటింగ్ పూర్తయిన వెంటనే డెట్టాల్ తో నోరు కడుక్కున్నానని తెలిపారు. పరిచయం లేని వ్యక్తులకు ముద్దు పెట్టడం చాలా కష్టమని అన్నారు.
Neena Gupta
Kiss Scene

More Telugu News