Ratan Tata: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులపై క్లారిటీ ఇచ్చిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా

Ratan Tata condemns that he has investments in Crypto Currency
  • క్రిప్టోలో రతన్ టాటా పెట్టుబడులు అంటూ ప్రచారం
  • ఖండించిన రతన్ టాటా
  • ఇలాంటి వార్తలకు నెటిజన్లు దూరంగా ఉండాలని సూచన
  • ప్రజలను మోసగించే ప్రకటనలు అంటూ వెల్లడి 
టాటా గ్రూప్ గౌరవ చైర్మన్, వ్యాపార దిగ్గజం రతన్ టాటా క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడుల అంశంపై స్పష్టతనిచ్చారు. క్రిప్టోకరెన్సీతో తనకు ఏ రూపంలోనూ సంబంధం లేదని వెల్లడించారు. తనకు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు ఉన్నాయన్న వార్తలకు నెటిజన్లు దూరంగా ఉండాలని రతన్ టాటా సూచించారు. 

"నేను క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టినట్టు ఏవైనా కథనాలు మీ దృష్టికి వస్తే వాటిని నమ్మవద్దు. అవి ఎంతమాత్రం నిజం కావు. ప్రజలను మోసగించడానికే అలాంటి కథనాలు వస్తున్నాయని అర్థం చేసుకోండి" అని రతన్ టాటా పేర్కొన్నారు. 

ఇలాంటి కథనాల బాధితుడు రతన్ టాటా ఒక్కరే కాదు... గతంలో ఆనంద్ మహీంద్రాపైనా ఇలాంటి వార్తలే వచ్చాయి. ఆయన కూడా ఆ వార్తలను ఖండించారు. తనకు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు ఉన్నాయంటూ ఆన్ లైన్ లో వచ్చిన ప్రకటన చూసి ఓ వ్యక్తి తనను అప్రమత్తం చేశాడని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఇది ప్రమాదకర ధోరణి అని, తనకు క్రిప్టోలో పెట్టుబడులు అంటూ వస్తున్న వార్తలు కల్పితాలేనని స్పష్టం చేశారు.
Ratan Tata
Crypto Currency
Investments
Anand Mahindra
India

More Telugu News