Komatireddy Venkat Reddy: నా తమ్ముడి గురించి తెలియదు.. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

MP Komatireddy to contest Assembly in next election
  • బీఆర్ఎస్ తో పొత్తు ఉండదన్న కోమటిరెడ్డి
  • ఎప్పుడు రమ్మంటే అప్పుడు తెలంగాణకు రావడానికి రాహుల్ గాంధీ సిద్ధమన్న ఎంపీ
  • వచ్చే నెలలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడి 

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గురించి తనకు తెలియదన్నారు. తాను మాత్రం ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. బీసీ, ఎస్టీ, ఎస్సీలకు టిక్కెట్లు, పదవుల విషయంలో ప్రాధాన్యం ఇస్తామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారన్నారు.

ఎప్పుడు రమ్మంటే అప్పుడు తెలంగాణకు రావడానికి సిద్ధమని రాహుల్ చెప్పారన్నారు. సర్వే ఆధారంగానే సీట్లు, టిక్కెట్ కేటాయింపు ఉంటుందని చెప్పారు. వచ్చే నెలలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. కేసీఆర్ అవినీతి లెక్కలు బయటకు తీయాలని అగ్రనాయకత్వం సూచించిందన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు.

  • Loading...

More Telugu News