ambati rayudu: గుంటూరు ఎంపీ పదవికి పోటీపై స్పందించిన అంబటి రాయుడు

Ambati Rayudu says he will not contest from Guntur Lok Sabha
  • ప్రజలకు సేవ చేస్తాననీ, ఏ ప్లాట్ ఫామ్ అనేది త్వరలో చెబుతానని స్పష్టం చేసిన రాయుడు 
  • క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, రైతు సమస్యలు తెలుసుకుంటున్నట్లు వెల్లడి 
  • నేడు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పర్యటించిన రాయుడు
క్రికెటర్ అంబటి రాయుడు మంగళవారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా అమీనాబాద్ లోని మూలాంకరీశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పాఠశాలలో విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. వారికి కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడారు. అమ్మవారు పుట్టిన గ్రామానికి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు ఉన్నతస్థాయిలో ఉన్నవారిని ఆదర్శంగా తీసుకొని చదవాలన్నారు.

అన్నీ ఊహాగానాలేనన్న రాయుడు 

తాను గుంటూరు ఎంపీ పదవికి పోటీ చేస్తానని వచ్చిన వార్తలు అన్నీ ఊహాగానాలేనని అంబటి రాయుడు ఓ ఛానల్ తో చెప్పారు. తాను ఇదివరకు ముఖ్యమంత్రిని కలిశానని, కానీ రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. తాను ప్రజా సేవ చేస్తానని, కానీ ఏ ప్లాట్ ఫామ్ నుండి అనేది త్వరలో చెబుతానని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, రైతు సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు.
ambati rayudu
Cricket
Andhra Pradesh

More Telugu News