Posani Krishna Murali: పవన్ కల్యాణ్ ఈ డేంజర్ గేమ్ ను కాపు యువత మీద వాడుతున్నాడు: పోసాని

Posani take a swipe at Pawan Kalyan
  • ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పవన్ వారాహి యాత్ర
  • పవన్ కాపు యువతను రెచ్చగొడుతున్నాడన్న పోసాని
  • వారి భవిష్యత్తును ప్రమాదకరంగా మార్చుతున్నాడని విమర్శలు

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సాగుతున్న తీరుపై సినీ నటుడు, ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధం హ్యూమన్ మైండ్ అని, ఇప్పుడు హ్యూమన్ మైండ్ ను ఆధారంగా చేసుకునే పవన్ కల్యాణ్ గేమ్ మొదలుపెట్టాడని వెల్లడించారు. 

ఇదెంత డేంజర్ గేమ్ అంటే... కత్తులు, తుపాకుల కంటే డేంజర్ అని, ఇలాంటి ప్రమాదకర గేమ్ ను పవన్ కల్యాణ్ కాపు యువతపై వాడుతున్నాడని పోసాని విమర్శించారు. "చివరికి కాపు యువత ఎలా తయారయ్యారంటే... పవన్ కల్యాణ్ కొడతా అన్నాడు... మనం కొట్టాలి... పవన్ కల్యాణ్ తిడతా అన్నాడు.. మనం తిట్టాలి... పవన్ కల్యాణ్ చంపేస్తా అన్నాడంటే... మనం చంపి రావాలి అనుకుంటున్నారు. 

రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్... ఆ రెండు లక్షల పుస్తకాల్లోని విజ్ఞానాన్ని విషంగా మార్చి చక్కెర పూత పూసి, ఆ విషపు గుళికలను చప్పరించమని కాపు యువతకు చెబుతున్నాడు.

 భవిష్యత్తులో ఇదెంత ప్రమాదకరంగా మారుతుంది అంటే... ప్రజలు కన్నీళ్లతో చూడడం తప్పించి ఇంకేమీ చేయలేరు. ఎంతమంది రంగాలు చచ్చిపోతారో, ఎంతమంది డాక్టర్ శ్రీహరిలు చచ్చిపోతారో... లెక్క ఉండదు. దయచేసి ఈ డేంజర్ గేమ్ ఆడొద్దని పవన్ కల్యాణ్ కు విజ్ఞప్తి చేస్తున్నా" అని పోసాని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News