Asaduddin Owaisi: కేటీఆర్‌ను ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉంది: కేసీఆర్‌కు అసదుద్దీన్ ప్రశ్నల వర్షం

Asaduddin Owaisi questions to CM KCR
  • అన్ని కులాలకు భవనాలు కట్టి ఇస్లామిక్ సెంటర్ ఎందుకు కట్టలేదని ప్రశ్న
  • ఉస్మానియా ఆసుపత్రిని పట్టించుకోలేదని విమర్శ
  • మెట్రో రైలును పాతబస్తీ వరకు ఎందుకు నిర్మించలేదని ప్రశ్న
  • తెలంగాణలో మతతత్వం పెరుగుతోందన్న అసద్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ను ప్రమోట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై అసదుద్దీన్ ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని కులాలకు భవనాలు కట్టిన ప్రభుత్వం ఇస్లామిక్ సెంటర్ ను మాత్రం వదిలేసిందన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని పట్టించుకోవడంలేదని వాపోయారు. ఈ ఆసుపత్రి గురించి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు.

మెట్రో రైలును కూడా పాతబస్తీ వరకు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజలకు దూరం కావొద్దని హితవు పలికారు. మంచి చేస్తే తాము ప్రశంసిస్తామని, అభివృద్ధి చేయకుంటే ప్రశ్నిస్తామన్నారు. తెలంగాణలో మతతత్వం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రులను కలవడంపై స్పందిస్తూ... ఇలా కలవడం మంచిదే అన్నారు. ఉమ్మడి పౌర స్మృతిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పంజాబ్ లో దీనిని అమలు చేయగలరా అని ప్రశ్నించారు. హిందూ సివిల్ కోడ్ బిల్లు తెచ్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. దేశంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News