Anam Venkataramana Reddy: అలాంటి మగాడు ఇంకా పుట్టలేదురా బచ్చా.. అనిల్ కుమార్‌‌పై ఆనం వెంకట రమణా రెడ్డి ఫైర్

anam venkataramana reddy fire on anil kumar
  • ఒరేయ్ జగన్.. తురేయ్ అనిల్ అని తామూ అనగలమన్న ఆనం
  • మీ నాయకుడు ఏం చదివాడో చెప్పగలవా అని ప్రశ్న
  • సొంత బాబాయ్‌తోనే నీకు ఎందుకు పడటం లేదంటూ నిలదీత

మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆనం కుటుంబాన్ని అంతం చేసే మగాడు ఇంకా పుట్టలేదురా బచ్చా అనిల్ అంటూ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నారా లోకేశ్ పాదయాత్ర క్యాంప్ సైట్ వద్ద మీడియాతో ఆనం మాట్లాడారు.

‘‘నువ్వు ఒరేయ్ తురేయ్ అంటే మేం దానికి మించి మాట్లాడతాం.. ‘ఒరేయ్ జగన్’ ‘ఒరేయ్ అనిల్, తురేయ్ అనిల్’ అంటే నువ్వు, నీ నాయకుడు తల ఎక్కడ పెట్టుకుంటారు?” అని ప్రశ్నించారు. ‘‘మా యువ నాయకుడు లోకేశ్ అమెరికాలో చదివాడని గర్వంగా చెప్పుకుంటాం.. మీ నాయకుడు ఏం చదివాడో, ఎక్కడ చదివాడో చెప్పగలవా అనిల్? స్టాన్ ఫోర్డ్‌లో చదివిన లోకేశ్ పప్పా?.. పదోతరగతి తప్పిన జగన్ నిప్పా?”అని నిలదీశారు.

మీ నాయకుడు గంటపాటు తడబడకుండా మీడియాతో మాట్లాడగలడా? కాగితాలు చూడకుండా సమాధానం చెప్పగలడా? మీ నాయకుడి చదువు ఇదని ఫలానా చోట చదివాడని చెప్పగలవా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

సొంత బాబాయ్ సహా, నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో, ఆఖరికి మంత్రులతో కూడా నీకు ఎందుకు పడటంలేదు అనిల్? అని అడిగారు. జగన్ టిక్కెట్లు ఇచ్చిన వారిని ఓడించిన అనిల్, ముఖ్యమంత్రికి వీరాభిమానా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతకు ఇంటర్నేషనల్ నోటీసు వచ్చిందని మాజీమంత్రి బహిరంగంగా అంటే ముఖ్యమంత్రి స్పందించడా? అని నిలదీశారు.

  • Loading...

More Telugu News