Chandrababu: చింతలూరులో శ్యామ్ మృతిపై లోతైన దర్యాప్తు జరపాలి: చంద్రబాబు

Chandrababu reacts on NTR fan Shyam death
  • తూర్పుగోదావరి జిల్లాలో శ్యామ్ అనే యువకుడి అనుమానాస్పద మృతి
  • శ్యామ్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని
  • శ్యామ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • ఈ వ్యవహారంలో వైసీపీ వర్గీయులపై ఆరోపణలు వస్తున్నాయని వెల్లడి

తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మేడిశెట్టి శ్యామ్ అనుమానాస్పద స్థితిలో విగతజీవుడిగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 

శ్యామ్ విషాదకర రీతిలో అకాలమరణం చెందడం తీవ్ర విచారానికి గురిచేసిందని తెలిపారు. అతడి మృతి చుట్టూ పలు అనుమానాలు ముసురుకుంటున్నాయని పేర్కొన్నారు. శ్యామ్ మృతిపై లోతైన దర్యాప్తు చేయాలని గట్టిగా కోరుతున్నానని, న్యాయం జరగాలని భావిస్తున్నానని చంద్రబాబు వివరించారు. 

ఈ వ్యవహారంలో వైసీపీ వర్గీయుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. వైసీపీ వాళ్ల పాత్ర ఉండి ఉంటే నిష్పాక్షికంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని పారదర్శకంగా దర్యాప్తు జరిపి, వాస్తవాన్ని వెలికితీయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News