Etela Jamuna: ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారు: ఈటల జమున

Kaushik Reddy trying to kill my husband says Etela Jamuna
  • తన భర్తను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న జమున
  • హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్ రెడ్డి చెప్పినట్టు తెలిసిందని వ్యాఖ్య
  • కేసీఆర్ అండ చూసుకుని రెచ్చిపోతున్నారన్న జమున
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఈటలను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. ఈటల హత్యకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని చెప్పారు. తన భర్త హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్ రెడ్డి చెప్పినట్టు తనకు తెలిసిందని అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ అండ చూసుకుని కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. పదవుల కోసం ఈటల తలవంచరని అన్నారు. ఈటల బీజేపీలోనే ఉంటారని... ఆయన పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. జమున వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 

Etela Jamuna
Etela Rajender
BJP
Murder
Kaushik Reddy
KCR
BRS

More Telugu News