Uttar Pradesh: యూపీలో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ కాల్చివేత

 UP criminal Gufran shot dead
  • గుఫ్రాన్‌పై 13కుపైగా హత్య, దోపిడీ, లూటీ కేసులు
  • తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఎన్‌కౌంటర్
  • తలపై రూ. 1.25 లక్షల రివార్డు
పలు హత్య కేసుల్లో పోలీసులకు మోస్ట్‌వాంటెడ్ అయిన యూపీ క్రిమినల్ గుఫ్రాన్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. కౌశంబిలోని ఓ చక్కెర మిల్లు సమీపంలో ఈ తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 

స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుఫ్రాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గుఫ్రాన్‌పై ప్రతాప్‌గఢ్‌, సుల్తాన్‌పూర్‌లో 13కు పైగా హత్య, లూటీ, దోపిడీ కేసులు ఉన్నాయి. అతడి తలపై రూ. 1.25 లక్షల రివార్డు కూడా ఉంది.
Uttar Pradesh
Gufran
Most Wanted
Encounter

More Telugu News