air india: ఎయిరిండియా విమానం రద్దు.. ప్రయాణికుల ఇబ్బంది

150 passengers stranded at Chennai airport after air india cancels delhi bound flight
  • ఢిల్లీకి వెళ్లే విమానం కోసం బోర్డింగ్ వద్ద ప్రయాణికుల పడిగాపులు
  • విమాన సర్వీసును రద్దు చేసిన ఎయిరిండియా
  • చెన్నై విమానాశ్రయంలో చిక్కుకున్న 150 మంది ప్రయాణికులు

ఎయిరిండియా విమానం ఆలస్యం కారణంగా చెన్నై విమానాశ్రయంలో 150 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం గం.10.05కి చెన్నై నుండి ఎయిరిండియా విమానం ఢిల్లీకి బయలుదేరాలి. అయితే, ఇప్పటికీ విమానం బయలుదేరకపోవడంతో, ప్రయాణికులు బోర్డింగ్ గేట్ వద్ద పడిగాపులు కాశారు. చివరికి విమానం రద్దయింది. దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విమానం రద్దుకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News