Kajol: నా ఉద్దేశంలో 'లస్ట్' అంటే ఇదే: కాజోల్

what is lust in Kajols opinion
  • లస్ట్ అంటే విపరీతమైన కోరిక అని చెప్పిన కాజోల్
  • తన వరకు తన జీవితమే పెద్ద లస్ట్ అని వ్యాఖ్య
  • ఇష్టమైన ఆహారాన్ని తినడం, పిల్లలతో గడపడం కూడా లస్ట్ అన్న కాజోల్
కాజోల్, తమన్నా, మృణాల్ ఠాకూర్, విజయ్ వర్మ తదితరలు నటించిన 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఈ సిరీస్ కు అమిత్ ఆర్ శర్మ, ఆర్ బాల్కీ, సుజయ్ ఘోష్, కొంకణా సేన్ శర్మలు దర్శకత్వం వహించారు. మరోవైపు ఈ సిరీస్ ప్రమోషన్లో నటీనటులు బిజీగా ఉన్నారు.

 ప్రమోషన్స్ సందర్భంగా కాజోల్ ను లస్ట్ అంటే ఏమిటని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా... లస్ట్ అంటే విపరీతమైన కోరిక అని... అది మన శారీరక వాంఛ మాత్రమే కాదని, ఏదైనా కావొచ్చని చెప్పారు. తన వరకైతే తన జీవితమే పెద్ద లస్ట్ అని అన్నారు. ఇష్టమైన ఆహారాన్ని తినడం, పిల్లలతో గడపడం, డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ ను ఆస్వాదించడం, తనకు అలవాటైన కుట్లు, అల్లికలు ఇవన్నీ తనకు లస్ట్ తో సమానమని చెప్పారు.
Kajol
Lust
Bollywood

More Telugu News