Chandrababu: ఇది రాష్ట్రమా... రావణ కాష్ఠమా?: వీడియో పంచుకున్న చంద్రబాబు

Chandrababu shared a video and fires on CM Jagan
  • సీఎం జగన్ ను విమర్శిస్తూ చంద్రబాబు ఘాటు స్పందన
  • నాలుగేళ్ల నరకం అంటూ కొన్ని ఘటనలను ఉదహరించిన టీడీపీ అధినేత
  • సీఎం మౌనానికి కారణమేంటి అంటూ ఆగ్రహం
  • జగన్ ప్రజల బిడ్డే అయితే ఇలా మౌనంగా ఉంటారా అంటూ మండిపాటు
రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో విడుదల చేశారు. ఇది రాష్ట్రమా... రావణ కాష్ఠమా? అని ప్రశ్నించారు. వరుస దుర్ఘటనలతో నాలుగేళ్ల నరకం అంటూ కొన్ని ఉదంతాలను పేర్కొన్నారు. 

బాలుడి సజీవ దహనం, ఏలూరులో యాసిడ్ దాడి జరిగినా స్పందనేదీ? అంటూ చంద్రబాబు నిలదీశారు. నెల్లూరు, మచిలీపట్నంలో జరిగిన అత్యాచారాలపై సీఎం మౌనంగా ఉండడానికి కారణమేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజకీయ కక్షతో మహిళను చంపినా ఈ బిడ్డ ఒక్క మాట కూడా మాట్లాడరా? అని మండిపడ్డారు. జగన్ ప్రజల బిడ్డే అయితే దాడులు చేసినవారిని వదిలేస్తారా? జగన్ ప్రజల బిడ్డే అయితే పేదల ప్రాణాలకు వెలకడతారా? అని నిలదీశారు. 

వరుస ఘటనలు జరిగితే శాంతిభద్రతలపై కనీస సమీక్ష జరపలేదని చంద్రబాబు విమర్శించారు.
Chandrababu
Video
Jagan
TDP
Andhra Pradesh

More Telugu News