MS Dhoni: విమానంలో క్యాండీ క్రష్ ఆడిన ధోనీ.. అమాంతం పెరిగిపోయిన డౌన్ లోడ్స్!

MS Dhonis pic playing candy crush goes viral and 3 mn users immediately download game
  • ఇండిగో విమానంలో ధోనీ క్యాండీ ఆడిన వీడియో నెట్టింట వైరల్
  • ఎయిర్ హోస్టెస్ చాక్లెట్స్ తీసుకు వచ్చాక నవ్వుతూ తీసుకున్న ధోనీ
  • ఆ సమయంలో పక్కనే భార్య సాక్షి
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ క్యాండీ క్రష్ ఆడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ గేమ్ ను చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టపడతారు. అలాంటి ఆటను ధోనీ కూడా ఆడుతూ కనిపించడంతో వీడియో చక్కర్లు కొడుతోంది. ధోనీ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎయిర్ హోస్టెస్ చాక్లెట్లు, స్వీట్స్ తీసుకొని అతని వద్దకు వెళ్లింది. అప్పటి వరకు ధోనీ తన ట్యాబ్ లో క్యాండీ క్రష్ ఆడుతూ ఉన్నాడు. ఎయిర్ హోస్టెస్ రాకను గమనించిన ధోనీ ట్యాబ్ లో తన ఆటను కాస్త పక్కన పెట్టాడు. చాక్లెట్లు తీసుకోవాలని చెప్పగా, చిరునవ్వుతో ఓ ప్యాకెట్ తీసుకున్నాడు. ఆ సమయంలో ధోనీ పక్కన భార్య సాక్షి కూడా ఉన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వైరల్ గా మారిన తర్వాత క్యాండీ క్రష్ గేమ్ డౌన్ లోడ్స్ భారీగా పెరిగాయట. ఈ వీడియో వైరల్ గా మారడంతో క్యాండీ క్రష్ యాప్ మూడు గంటల్లోనే 3.6 మిలియన్ల డౌన్ లోడ్స్ అయ్యాయట. ధోనీ వీడియోను లక్షలాది మంది చూస్తున్నారు. క్యాండీ క్రష్ పెద్ద ఎత్తున డౌన్ లోడ్ అవుతోందని, ఇందుకు ధోనీకి థ్యాంక్స్ అంటూ ఓ నెటిజన్ సరదాగా పేర్కొన్నాడు.
MS Dhoni
Cricket

More Telugu News