JP Nadda: ఇండియాలో అడుగుపెట్టీ పెట్టగానే మోదీ అడిగిన తొలి ప్రశ్న ఇదే

Whats happening in India PM Modi asks Nadda after returning from six day foreign tour
  • అమెరికా, ఈజిప్ట్ పర్యటన ముగించుకుని గత రాత్రి ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ
  • స్వాగతం పలికిన బీజేపీ చీఫ్ నడ్డా, ఇతర నేతలు
  • మోదీ ప్రశ్నకు దేశం సంతోషంగా ఉందని బదులిచ్చిన నడ్డా
‘దేశంలో ఏం జరుగుతోంది?’.. విదేశీ పర్యటనను ముగించుకుని గత రాత్రి ఇండియాలో ల్యాండైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోటి నుంచి వచ్చిన తొలి ప్రశ్న ఇదే. ప్రధానికి ఢిల్లీ విమానాశ్రయంలో బీజేపీచీఫ్ జేపీ నడ్డా, ఇతర నాయకులు స్వాగతం పలికారు. ఆ వెంటనే మోదీ నడ్డాతో మాట్లాడుతూ.. దేశంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు.

అమెరికా, ఈజిప్ట్‌లో ఆరు రోజులపాటు పర్యటించిన ప్రధాని పలు కీలక ఒప్పందాలతో తిరిగి వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు నడ్డా స్వాగతం పలికారు. ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు, పార్టీ ఎంపీలైన హర్ష్ వర్ధన్, హన్స్‌రాజ్, గౌతం గంభీర్ వంటివారు ఆయనతో ఉన్నారు. 

తనను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన నడ్డాను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. ఇక్కడేం జరుగుతోందని ప్రశ్నించారని, దానికాయన బదులిస్తూ 9 ఏళ్ల పాలన రిపోర్ట్ కార్డుతో పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారని, దేశం సంతోషంగా ఉందని చెప్పారని పార్టీ ఎంపీ మనోజ్ తివారీ మీడియాకు తెలిపారు.
JP Nadda
BJP
Narendra Modi
USA
Egypt

More Telugu News