adi narayana reddy: షర్మిల అన్న వదలిన బాణం కాదు.. అన్న వదిలేసిన బాణం: ఆదినారాయణ రెడ్డి సెటైర్లు

bjp leader adinarayana reddys shocking comments on sharmila
  • జగన్ వదిలేసిన బాణమే ఏపీకి రాబోతోందన్న ఆదినారాయణ రెడ్డి
  • షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం ఉందని వెల్లడి 
  • ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే జగన్ పని ఔటేనని వ్యాఖ్య
వైఎస్సార్‌‌టీపీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారని స్పష్టమైన సమాచారం ఉందని అన్నారు. ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. 

‘‘షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే జగన్ పని ఔటే. షర్మిల అన్న వదలిన బాణం కాదు.. అన్న వదిలేసిన బాణం. ఆ బాణమే రాబోయే రోజుల్లో ఏపీకి రాబోతోంది” అని సెటైర్లు వేశారు.

జగన్ రెడ్డి పోలవరానికి పొగపెట్టి.. అమరావతికి అగ్గిపెట్టారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. కేంద్రం ఏపీకి 35 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే కనీసం 35 ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం ఏంటో సెప్టెంబర్ తర్వాత తెలుస్తుందని చెప్పారు.
adi narayana reddy
Sharmila
Jagan
Congress

More Telugu News