Andhra Pradesh: అలా చేస్తే జనం మమ్మల్ని తంతారు: తమ్మినేని సీతారాం

Speaker tammineni sitaram attends zp all members meeting in srikakulam
  • శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న శాసనసభాపతి తమ్మినేని సీతారాం
  • గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగని వైనాన్ని సభాపతి దృష్టికి తీసుకెళ్లిన సభ్యులు
  • సకాలంలో పనులు పూర్తి చేయాలంటూ అధికారులకు సభాపతి ఆదేశాలు

పనులు చేయకుండా ఎన్నికల్లో ఓట్లు అడిగితే ప్రజలు తంతారని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు విజయ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు జడ్పీటీసీ సభ్యులు తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగని విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ క్రమంలో శాసనసభాపతి మాట్లాడుతూ..‘జల్‌జీవన్ మిషన్ పనుల్లో భాగంగా గ్రామాల్లో కుళాయిలు, పైపులైన్లు వేసి నీటి సరఫరా చేయాలి కానీ ఆ పనులు చేయట్లేదు. ఇలాగైతే రేపు ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు ఓట్లు అడగటానికి ఎలా వెళ్తాం? పనులు మధ్యలో ఆగిపోయి.. పూర్తిచేయకుండా ఓట్లు  అడగడానికి వెళ్తే జనం మమ్మల్ని తంతారు. వాటిని సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టండి’ అని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News