Viswaroop: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేనూ కోరుకుంటున్నా: మంత్రి పినిపె విశ్వరూప్‌ సంచలన వ్యాఖ్యలు

ap minister vishwaroop sensational comments on pawan kalyan
  • రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చన్న విశ్వరూప్
  • సీఎం కావాలంటే 88 స్థానాల్లో గెలవాలని వ్యాఖ్య 
  • లేదా పొత్తుతో 50 సీట్లయినా సాధించాలన్న మంత్రి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తానూ కోరుకుంటున్నానంటూ ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు మాత్రమే కాకుండా తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చని అన్నారు. ‘‘రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 88 స్థానాల్లో గెలిస్తే ముఖ్యమంత్రి కావచ్చు. పొత్తుతో 100 స్థానాల్లోనైనా పోటీ చేసి 50 స్థానాల్లోనైనా గెలవాలి” అని అన్నారు.
Viswaroop
Pawan Kalyan
Tirumala
Janasena
YSRCP

More Telugu News