Nimmakayala Chinarajappa: బత్తులవారిగూడెంలో కుప్పకూలిన సభా వేదిక... కిందపడిపోయిన చినరాజప్ప, చింతమనేని ప్రభాకర్

TDP rally stage collapsed as Chinarajappa and other leaders fell down
  • నూజివీడు మండలంలో ఘటన
  • టీడీపీ సభలో అపశ్రుతి 
  • చినరాజప్ప ప్రసంగిస్తుండగా ఈదురుగాలులు
  • స్టేజి కూలడంతో ముందుకు పడిపోయిన చినరాజప్ప

నూజివీడు మండలం బత్తులవారిగూడెం టీడీపీ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభా వేదిక కుప్పకూలడంతో చినరాజప్ప, చింతమనేని ప్రభాకర్, ఇతర టీడీపీ నేతలు కిందపడిపోయారు. స్టేజిపై చినరాజప్ప ప్రసంగిస్తుండగా బలమైన ఈదురుగాలులు వీచాయి. గాలికి ఊగిన వేదిక కూలిపోయింది. దాంతో చినరాజప్ప ముందుకు పడిపోయారు.. ఇతర నేతలు కూడా పడిపోవడంతో అక్కడ ఆందోళన నెలకొంది. ఈ హఠాత్పరిణామానికి టీడీపీ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే స్పందించిన ఇతర నేతలు, కార్యకర్తలు పడిపోయిన వారిని పైకి లేపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News