ధోనీ పెట్టుబడులతో దిగ్గజ కంపెనీగా ఎదిగిన సంస్థ
- డ్రోన్ల రంగంలో ప్రముఖ కంపెనీగా ఎదిగిన గరుడ ఏరోస్పేస్
- 2022లో ఈ కంపెనీలో ధోనీ పెట్టుబడులు.. అనంతరం ప్రచారం
- ఏటా ఎన్నో కంపెనీల్లో పెట్టుబడులు
ఈ గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన అగ్నీశ్వర్ జైప్రకాష్ ఎంఎస్ ధోనీకి అతిపెద్ద వ్యాపార భాగస్వామి కావడం గమనించాలి. స్వతహాగా అగ్నీశ్వర్ అంతర్జాతీయ స్థాయి స్విమ్మర్. 2022లో గరుడ ఏరోస్పేస్ లో ధోనీ పెట్టుబడులు పెట్టాడు. ప్రస్తుతం ఈ కంపెనీ వద్ద 400 డ్రోన్లు ఉన్నాయి. స్విగ్గీ, ఫ్లిప్ కార్ట్, డెల్హివరీ (గోదాముల కోసం) కోసం గరుడ ఏరోస్పేస్ సేవలు అందిస్తోంది. గతేడాది ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ధోనీ ఈ కంపెనీకి బ్రాండ్ ప్రచారకర్త బాధ్యతలు సైం తీసుకున్నాడు. ధోనీ ఏటా ఎన్నో కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం గమనించొచ్చు.