Jio Phone 5G: తక్కువ ధరలో వస్తున్న జియో 5జీ ఫోన్

First images of Jio Phone 5G leaked online smartphone to be priced under Rs 10000
  • ధర రూ.10వేల లోపే ఉండే అవకాశం
  • 6.6 అంగుళాల డిస్ ప్లే
  • వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా
రిలయన్స్ జియో 5జీ ఫోన్ ను తక్కువ ధరలోనే ఈ ఏడాది చివర్లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించి ఫొటోలు అప్పుడే ఆన్ లైన్ లోకి చేరాయి. వీటిని అర్పిత్ పటేల్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. వెనుక డ్యుయల్ కెమెరా, ఫ్లాష్ లైట్ తో ఉండడాన్ని గమనించొచ్చు. ఒకటి 13 మెగాపిక్సల్ ఏఐ కెమెరా అయితే, మరొకటి 2 మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా. 

ముందు భాగంగా 6.6 అంగుళాల వాటర్ డ్రాప్ డిస్ ప్లే ఉండడాన్ని గమనించొచ్చు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. దీని ధర రూ.10,000 కంటే తక్కువే ఉంటుందని అంచనా. ఈ ఫోన్ లో మీడియాటెక్ డెమైన్సిటీ 700 లేదంటే యూనిసాక్ 5జీ చిప్ సెట్ ఉపయోగించొచ్చని తెలుస్తోంది. జియోకి గూగుల్ తో భాగస్వామ్యం ఉంది. కనుక ఈ ఫోన్ లో ప్రత్యేక ఓఎస్ (ప్రగతి ఓఎస్) ఏర్పాటు చేయొచ్చు. జియో కస్టమర్లకు ఆఫర్లపై ఫోన్ ను విక్రయించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది దీపావళి రోజున దీన్ని విడుదల చేయొచ్చని భావిస్తున్నారు.
Jio Phone 5G
release
dipavali
Rs 10000

More Telugu News