VYOOHAM: ఆర్జీవీ ‘వ్యూహం’ టీజర్ ముహూర్తం ఖరారు

VYOOHAM teaser releasing dayafter 24 th 11 Am
  • రేపు  ఉదయ 11 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటన
  • ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం
  • శపథం పేరిట మరో సినిమాను కూడా ప్రకటించిన ఆర్జీవీ

సంచలన, వివాదాస్పద చిత్రాలు తీసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఏపీ రాజకీయాల నేపథ్యంలో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ‘వ్యూహం’ అనే సినిమా రూపొందిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. 

ఇప్పుడు ‘వ్యూహం’ సినిమా నుంచి ఆర్జీవీ మరో అప్ డేట్ ఇచ్చారు. సినిమా టీజర్ ను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, శపథం పేరిట కూడా ఓ సినిమాను రూపొందిస్తున్నట్టు ఆర్జీవీ తెలిపారు. వ్యూహం తర్వాత ఆ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News