Paki: గొడుగు తీసేసుకున్న పాక్ ప్రధాని.. వానలో తడిసిపోయిన మహిళా అధికారి

Pak minister takes umbrella away woman officer gets drenched in rain video goes viral
  • న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ సమావేశంలో పాల్గొనేందుకు ప్యారిస్ చేరుకున్న పాక్ ప్రధాని షాబాజ్ 
  • ఇంతలో వర్షం మొదలు, ప్రధానికి గొడుగు పట్టిన మహిళా అధికారి
  • మహిళా అధికారికి ఏదో చెప్పి ఆమె చేతిలో గొడుగు తీసేసుకున్న ప్రధాని
  • గొడుగు లేక వానలో తడిసి ముద్దయిన అధికారిణి 
  • పాక్ ప్రధాని తీరుపై నెట్టింట విమర్శలు
పాక్ ప్రధాని చేసిన ఓ ఘనకార్యం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మర్యాద పాటించడం నేర్చుకోండంటూ నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ సమావేశంలో పాల్గొనేందుకు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ గురువారం ప్యారిస్‌కు నగరానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వర్షం మొదలైంది. దీంతో, కారులోంచి దిగుతున్న ప్రధానికి తడవకుండా ఉండేందుకు ఓ మహిళా అధికారి గొడుగు పట్టారు. 

ఈ క్రమంలో పాక్ ప్రధాని ఆ అధికారికి ఏదో చెప్పి, ఆమె చేతుల్లోంచి గొడుగు తీసేసుకుని నడుచుకుంటూ ముందుకెళ్లిపోయారు. మహిళా అధికారి మాత్రం ఆయన వెనుక వానలో తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు పాక్ ప్రధానిపై దుమ్మెత్తిపోస్తున్నారు. పాకిస్థాన్ పరువు మంటకలిపావంటూ మరికొందరు మండిపడ్డారు.
Paki
Viral Videos
France

More Telugu News