Andhra Pradesh: భార్యతో గొడవ.. కన్నతల్లిని చంపిన తనయుడు!

Man ends up killing mother following unending quarrels with his wife
షార్ట్స్‌లో చూడండి
తల్లీభార్యల మధ్య తగవులతో నలిగిపోయిన ఓ వ్యక్తి చివరకు దారుణానికి పాల్పడ్డాడు. తాము కట్టుకున్న కొత్త ఇంట్లోకి తల్లిని తీసుకురావద్దంటూ భార్య భీష్మించుకుని కూర్చోవడంతో అతడు ఏకంగా కన్నతల్లినే కడతేర్చాడు. బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం రామకూరులో ఈ దారుణం వెలుగు చూసింది. కే.సుబ్బులమ్మ(85) తన కుమారుడు శ్రీనివాసరావు కుటుంబంతో కలిసి ఉంటోంది. అయితే, అత్తాకోడళ్ల మధ్య తొలి నుంచీ గొడవలు జరిగేవి. 

ఇటీవలే శ్రీనివాసరావు గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాడు. అయితే, కొత్తింట్లో అత్తగారు కాలుపెడితే తాను ఆ ఇంట్లో ఉండనంటూ భార్య శ్రీనివాసరావుకు తెగేసి చెప్పడంతో అతడు ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. బుధవారం పొద్దుపోయాక తల్లిని ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకుని ఊరి చివరన ఉన్న చిన్నమ్మకుంట వద్దకు తీసుకెళ్లాడు. తనను ఎవరూ గమనించట్లేదని నిర్ధారించుకున్నాక తల్లిని నీళ్లల్లోకి తోసేసి వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం పశువుల కాపర్లు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో శ్రీనివాసరావే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు వెలుగులోకి వచ్చింది.
Go Back to Shorts
Andhra Pradesh

More Telugu News