Nara Lokesh: ​​బీసీలంటే జగన్ కు చిన్నచూపు... అందుకే ఆ బాలుడి ఇంటికి వెళ్లలేదు: నారా లోకేశ్

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ యువగళం
  • వెంకటగిరి పాత బస్టాండు సెంటర్ లో లోకేశ్ సభ
  • విశాఖను నేరాల రాజధానిగా చేశారంటూ విమర్శలు
  • జగన్ పాలన ఎంత దరిద్రంగా ఉందో వైసీపీ ఎంపీనే చెప్పారని వెల్లడి
Nara Lokesh fires on CM Jagan in Venkatagiri rally

జగన్ పాలనలో గంట‌కో హ‌త్య‌... పూట‌కో రేప్... కిడ్నాప్‌, అడుగ‌డుగునా దౌర్జ‌న్యాలు జరుగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్ర‌తీ ఊరిలోనూ క‌బ్జాలు... గంజాయి... నేర‌గాళ్లు చెల‌రేగిపోతుంటే ఏ ముఖ్య‌మంత్రి అయినా డీజీపీతో స‌మీక్ష నిర్వ‌హించి నేరాలు క‌ట్ట‌డి చేయాల‌ని ఆదేశిస్తారని, కానీ జైల్ జగన్ మాత్రం తియ్యబోయే సినిమాపై రామ్ గోపాల్ వర్మ తో సమీక్షా సమావేశం పెట్టుకున్నాడని విమర్శించారు. 

వెంకటగిరి పాతబస్టాండు సెంటర్ లో జరిగిన బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ... ఎవరూ మాట్లాడటం లేదు కదా అని జైల్ జగన్ ఇప్పుడు మహిళల్ని, పిల్లల్ని కూడా వదలడం లేదు... అంద‌రినీ అంతం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. 

"చంపేసి ప్రాణానికి ఖ‌రీదు క‌డుతున్నాడు. రేప్ జరిగితే మానానికి విలువ క‌డుతున్నాడు. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే నో సీఎం. బాలుడు అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర రెడ్డిని అడ్డుకున్నాడు. వైసీపీ సైకో గ్యాంగ్ అమర్నాథ్ పై దాడి చేసి కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. 

కనీసం అమర్నాథ్ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎంకి మనసు రాలేదు. దానికి కారణం అమర్నాథ్ ఒక బీసీ. బీసీలు అంటే జగన్ కి చిన్న చూపు. అందుకే అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదు" అని లోకేశ్ విమర్శించారు.

వెంకటగిరిలో పాదయాత్ర చేయడం అదృష్టం

ఎంతో ఘన చరిత్ర ఉన్న వెంకటగిరి గడ్డ పై పాదయాత్ర చెయ్యడం తన అదృష్టం అని లోకేశ్ వెల్లడించారు.  రాజులు ఏలిన నేల వెంకటగిరి అని తెలిపారు. వెంకటగిరి పట్టు చీరకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, కాశీ విశ్వనాధుడి ఆలయం, శ్రీ పోలేరమ్మ ఆలయం, పెంచలకోన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఉన్న పుణ్య భూమి వెంకటగిరి అని కీర్తించారు. 

కమలమ్మ జీడిపప్పు మైసూర్ పాక్ ఎంత స్వీట్ గా ఉంటుందో, ఇక్కడి ప్రజలు అంత స్వీట్ గా ఉంటారని కితాబిచ్చారు. వెంకటగిరి పవర్ ఫుల్ నేల...ఇక్కడి నుండి ఎంతో మంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారని లోకేశ్ వెల్లడించారు.

విశాఖను క్రైం క్యాపిటల్ గా చేశారు!

టీడీపీ విశాఖ‌ని ఆర్థిక రాజ‌ధానిగా అభివృద్ధి చేస్తే, వైసీపీ విశాఖని క్రైమ్ కేపిట‌ల్ గా మార్చేసిందని లోకేశ్ విమర్శించారు. సొంత పార్టీ ఎంపీ కొడుకు, భార్య‌, ఆడిట‌ర్ జీవి కిడ్నాప్ అయ్యారని తెలిపారు. అది కిడ్నాప్ కాదు జే గ్యాంగ్ సెటిల్మెంట్ అని ఎంపీ ఎంవీవీ మాటల్లో తేలిపోయిందని వెల్లడించారు. జగన్ పాలన ఎంత దరిద్రంగా ఉందో స్వయంగా వైసీపీ ఎంపీ ప్రకటించారని లోకేశ్ వివరించారు.

రాంకుమార్ రెడ్డి నేతృత్వంలో దోపిడీ పర్వం

"నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. కానీ రామ్ కుమార్ రెడ్డి ఆయన ఆశయాలను గాలికి వదిలేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం అరాచక శక్తులను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. 

రామ్ కుమార్ రెడ్డి గారి గురించి తెలుసుకున్న తరువాత ఆశ్చర్యం వేసింది. ఆయన ముందు ఎవరూ కూర్చో కూడదు అంట.. నిలబడి మాట్లాడాలంట. ప్రశాంతంగా ఉండే వెంకటగిరిని వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ కి కేరాఫ్ అడ్రస్ గా మార్చారు. కలువాయి మండలంలో వైసీపీ నేతలు 600 ఎకరాలు కబ్జా చేశారు.  స్థానిక ఎమ్మెల్యే గారికి తెలిసి కొన్ని పట్టాలు రద్దు చేయించగలిగారు. ప్రస్తుతం లోకాయుక్తా లో కేసు నడుస్తుంది" అని లోకేశ్ వివరించారు. 

రాంకుమార్ బినామీ ఎల్కేఆర్ ఆగడాలు!

వైసీపీ నేతలు పెన్నా నది నుండి ఇసుకను దోపిడీ చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. వెంకటగిరి, రాపూరు, కలువాయి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం మండలాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని తెలిపారు. దళితుల భూములు కూడా వదలడం లేదని లోకేశ్ అన్నారు. 

"వెంకటగిరి టైలర్స్ కాలనీలో పార్కులు, గుడులు, బడులు కోసం వదిలిన స్థలాన్ని వైసీపీ నేతలు ప్లాట్లు వేసి అమ్మేశారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ పేరు ఎల్కేఆర్...  పోలీస్ స్టేషన్లలో పంచాయితీల నుండి ఎర్రచందనం, ఇసుక, గ్రావెల్ దందా మొత్తానికి డాన్ ఆయనే. ఈ ఎల్కేఆర్ వెంకటగిరి బజార్ సెంటర్ లో రూ.10 కోట్లతో అక్రమంగా ఒక భవనం కూడా నిర్మించాడు. 

వెంకటగిరి మున్సిపాలిటీలో బిల్డింగ్ కట్టాలంటే వైసీపీ నేతలకి కప్పం కట్టాల్సిందే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన శ్యాంప్రసాద్ రెడ్డి ఏకంగా సోమశిల కెనాల్ ని ఆకిలవలస దగ్గర పూడ్చి పెట్టాడు" అంటూ లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1737.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 16.6 కి.మీ.*

*135వ రోజు పాదయాత్ర వివరాలు (23-6-2023):*

*వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం (తిరుపతి జిల్లా):*

సాయంత్రం

4.00 – నిడిగల్లు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

5.00 – పింగళం ఎస్టీ కాలనీలో ఎస్టీ సామాజికవర్గీయులతో సమావేశం.

5.20 – పింగళంలో స్థానికులతో సమావేశం.

5.40 – పింగళం ఎస్సీ కాలనీలో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

6.20 – పింగళం కొత్తపాలెంలో స్థానికులతో మాటామంతీ.

6.30 – కామకూరులో స్థానికులతో మాటామంతీ.

6.50 – హస్తకావేరిలో స్థానికులతో సమావేశం.

7.20 – జయంపు గ్రామంలో రైతులతో సమావేశం.

8.30 – ఇనుగుంట వద్ద సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

8.50 – కొత్తపాలెంపాడులో స్థానికులతో సమావేశం.

9.00 – వజ్జావారిపాలెంలో స్థానికులతో మాటామంతీ.

9.20 – వజ్జావారిపాలెం శివారు విడిది కేంద్రంలో బస.

******

  • Loading...

More Telugu News