titanic: ఆచూకీ లేని సబ్‌మెరైన్: మునిగిపోయిన టైటానిక్ గురించి నాడు కామెరూన్ ఏం చెప్పారంటే..!

  • కనిపించకుండా పోయిన టైటాన్ కోసం గాలింపు 
  • ఈ నేపథ్యంలో టైటానిక్ గురించి కామెరూన్ గతంలో చెప్పిన వ్యాఖ్యలు తెరపైకి
  • 33 సార్లు టైటానిక్ షిప్ మునిగిన ప్రాంతాన్ని సందర్శించిన దర్శక దిగ్గజం
Submersible missing What James Cameron said on Titanic

సముద్రగర్భంలో అచూకీ లభించకుండా పోయిన టైటాన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇప్పటికే కీలకమైన మూడు రోజుల గడువు పూర్తి కావొస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని పలుమార్లు సందర్శించిన హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ గతంలో పంచుకున్న అనుభవాలు ఇప్పుడు చాలామంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

 ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో ఇది ఒకటి అని టైటానిక్ మునిగిపోయిన ప్రాంతం గురించి కామెరూన్ నాడు చెప్పారు. 13 వేల అడుగుల లోతున ఉన్న టైటానిక్ ను డాక్యుమెంటరీ రూపంలో తీసుకువచ్చిన కామెరూన్ టైటానిక్ షిప్ మునిగిపోయిన ప్రాంతాన్ని 33 సార్లు సందర్శించారు.

మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలకు వెళ్లడం అంటే తనకు ఇష్టమని, అందుకే టైటానిక్ మునిగిన ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలనే ఆకాంక్షతోనే టైటానిక్ సినిమాను తీసినట్లు చెప్పారు. కానీ ప్రత్యేకంగా దానిని ఒక సినిమాగా తీయాలనే ఉద్దేశ్యం మొదట్లో తనకు లేదన్నారు. మునిగిపోయిన టైటానిక్ ను చూడాలనే సముద్రగర్భంలో సబ్ మెరైన్ లో ప్రయాణించానన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో టైటానిక్ ఎవరెస్ట్ వంటిది అన్నారు. దానిని బాగా చూపించాలనే ఉద్దేశ్యంతోనే పలుమార్లు టైటానిక్ మునిగిన ప్రాంతాన్ని సందర్శించినట్లు చెప్పారు. కాగా, టైటానిక్ గురించి గతంలో స్పందించిన కామెరూన్... ఇప్పుడు గల్లంతైన టైటాన్ గురించి ఇప్పటి వరకు అయితే స్పందించలేదు.

More Telugu News