Jagan: ఏపీలో పలు చోట్ల క్రికెట్ అకాడమీలు... అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

  • 'ఆడుదాం ఆంధ్ర' క్రీడోత్సవాలపై సీఎం జగన్ సమీక్ష
  • ఈ క్రీడా సంబరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని స్పష్టీకరణ
  • గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావాలని వెల్లడి
CM Jagan directs officials to establish cricket academies in state

ఏపీ సీఎం జగన్ 'ఆడుదాం ఆంధ్ర' క్రీడోత్సవాలపై సమీక్ష చేపట్టారు. 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ క్రీడా సంబరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. 

ఈ క్రీడా పోటీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడానికి ఉపయోగపడేలా ఉండాలని నిర్దేశించారు. ఈ పోటీల ద్వారా క్రీడాస్ఫూర్తి వెల్లివిరియాలని, పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు భోజన వసతుల విషయంలో ఎలాంటి లోటు రానివ్వరాదని తెలిపారు. క్రీడాకారులకు మంచి భోజనం అందించాలని సూచించారు. ఏపీలోని ప్రముఖ క్రీడాకారులు 'ఆడుదాం ఆంధ్ర' క్రీడోత్సవాల్లో భాగం అయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు వివరించారు.

ఇక, విశాఖలో ఉన్న వైఎస్సార్ స్టేడియంను స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్ తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని అన్నారు. అంతేకాకుండా, ఏపీలో క్రికెట్ అభివృద్ధికి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చిందని, తిరుపతి, కడప, విశాఖ, మంగళగిరిలో క్రికెట్ అకాడమీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

More Telugu News