Yash: రావణుడిగా తన పేరు వినిపించడం పట్ల స్పందించిన యశ్!

Yash Special
  • పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యశ్ 
  • నెక్స్ట్ ప్రాజెక్టు కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ 
  • రావణుడిగా నటించడం లేదన్న యశ్ 
  • నెక్స్ట్ ప్రాజెక్టును త్వరలో ప్రకటిస్తానని వెల్లడి

యశ్ కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 'కేజీఎఫ్'కి ముందు యశ్ పరిస్థితి వేరు .. ఆ సినిమా తరువాత ఆయన పరిస్థితి వేరు. ఇప్పుడు ప్రపంచమంతా ఆయన తదుపరి సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లోని మరో రామాయణం ప్రాజెక్టులో రావణుడిగా ఆయన పేరు వినిపించింది. 

శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్ ను .. సీతాదేవిగా అలియా భట్ ను తీసుకుని, నితీశ్ తివారి తన దర్శకత్వంలో మరో రామాయణాన్ని రూపొందించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంపైనే రణ్ బీర్ - అలియా ఆయనను కలిశారంటూ అందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి.

రావణుడిగా యశ్ నటించనున్నాడనగానే ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఇదే విషయాన్ని గురించి తాజాగా యశ్ దగ్గర ప్రస్తావించగా, తాను రావణుడిగా కనిపించనున్నాననే వార్తలో ఎంతమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. తన తాజా ప్రాజెక్టు ఏమిటనేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పాడు. తనపై అభిమానుల అంచనాలకి తగినట్టుగా ఆ ప్రాజెక్టు ఉంటుందని అన్నాడు. 

  • Loading...

More Telugu News