PM Modi: ప్రధాని మోదీకి వైట్ హౌస్ లో అదిరిపోయే విందు.. మెనూ ఇదే!

Millet cakes tangy avocado sauce Heres the menu for PM Modi US State dinner
  • ప్రధాని శాకాహారి కావడంతో మిల్లెట్ తో చేసిన ప్రత్యేక వంటకాలు
  • త్రివర్ణ రంగుల పువ్వులతో అలంకరణ
  • డిన్నర్ ముగిసిన తర్వాత సంగీత ప్రదర్శన
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ గురువారం రాత్రి వైట్ హౌస్ లో విందు (డిన్నర్) ఆతిథ్యం ఇవ్వనున్నారు. డిన్నర్ వివరాలను జిల్ బైడెన్ మీడియాకు వెల్లడించారు. ప్రధాని మోదీ శాకాహారి కావడంతో వైట్ హౌస్ చెఫ్ నీనా కర్టిస్ కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. శాకాహార వంటకాల తయారీలోనూ నీనా ఫేమస్. మొత్తం మీద బ్రహ్మాండమైన మెనూని సిద్ధం చేశారు. కావాలంటే మెయిన్ మెనూలో చేపల వంటకాలను చేర్చుకునే ఆప్షన్ కూడా ఉంచారు.

ఫస్ట్ కోర్స్ కింద (డిన్నర్ ఆరంభంలో) మ్యారినేటెడ్ మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నెల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మెలాన్, ట్యాంగీ అవకాడో సాస్ ఇస్తారు. తర్వాత మెయిన్ కోర్స్ లో భాగంగా స్టఫ్డ్ పోర్టోబెల్లో పుట్టగొడుగులు, క్రీమీ శాఫ్రాన్ రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్ డిల్ యుగర్ట్ సాస్, క్రిస్డ్ మిల్లెట్ కేక్స్, సమ్మర్ స్క్వాషెస్ వడ్డిస్తారు.

టేబుల్స్ పై శాఫ్రాన్ కలర్ పువ్వులతో అలంకరిస్తారు. భారత జాతీయ పతాకంలోని రంగుల పూలతో ఈ అలంకరణ ఉంటుంది. డిన్నర్ అనంతరం గ్రామీ అవార్డు విజేత జోషువా బెల్, పెన్ మసాలా, దక్షిణాసియాకు చెందిన అకపెల్ల గ్రూప్ తో సంగీత ప్రదర్శన ఉంటుంది. 


PM Modi
US trip
white house
dinner
special dishes
millets menu

More Telugu News