Chiranjeevi: చిరంజీవి గారు తాత అయ్యుండొచ్చు కానీ.. వైరల్ అవుతున్న మంత్రి రోజా ట్వీట్

Minister Roja extends congratulations to Ram Charan Upasana
  • తల్లిదండ్రులైన రామ్ చరణ్ దంపతులకు ట్విట్టర్ వేదికగా మంత్రి రోజా శుభాకాంక్షలు
  • చరణ్ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయని వ్యాఖ్య
  • రామ్ చరణ్‌కు పాప జన్మించడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని కామెంట్
  • చిరంజీవికి తాత టైటిల్ వచ్చినా ఎవర్ గ్రీన్ హీరోనే అన్న మంత్రి
మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అన్ని వైపుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా కూడా రామ్ చరణ్ దంపతులకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

‘‘తాత అయిన చిరంజీవి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎప్పుడూ యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండే చిరంజీవి గారి కుటుంబంలో మెగా ప్రిన్సెస్ రాక ఆ భగవంతుడు ఆశీర్వాదమే. డియర్ రామ్ చరణ్.. నిన్ను చిన్నప్పుడు నా చేతులతో ఎత్తుకున్న రోజులు నాకిప్పుడు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నీకు పాప పుట్టిందన్న వార్త మరింత సంతోషాన్ని కలిగించింది. చిరంజీవి సర్.. మీకు తాత అనే గొప్ప బిరుదు వచ్చినప్పటికీ మీరు ఎవర్ గ్రీన్ హీరోనే. ఉపాసన కొణిదెల, చిట్టి మహాలక్ష్మికి ఇవే నా ఆశీస్సులు’’ అని మంత్రి రోజా ట్వీట్ చేశారు.
Chiranjeevi
Ramcharan
Roja
Pawan Kalyan

More Telugu News